Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మగపిల్లాడి ధర రూ.5 లక్షలు...ఆడపిల్లైతే రూ.3 లక్షలేనట!:ఎన్జీవో ముసుగులో పిల్లల విక్రయాలు

సెల్ఫ్ హెల్ప్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్ పేరిట స్వచ్ఛంద సంస్థను తెరచిన తంబీ అనే వ్యక్తి పసిపిల్లలను విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో కొంతకాలంగా సాగుతున్న ఈ అక్రమ దందాకు పోలీసులు చెక్ పెట్టేశారు. స్వచ్ఛంద సంస్థ పేరిట గ్రామాల్లో పర్యటిస్తున్న సెల్ఫ్ హెల్ప్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ తంబీ, గుట్టుచప్పుడు కాకుండా పసిపిల్లలను విక్రయిస్తున్నాడు. ముక్కుపచ్చలారని మగ పిల్లాడి ధరను రూ.5 లక్షలుగా నిర్ణయించిన అతడు, ఆడపిల్లలను రూ.3 లక్షలకే విక్రయిస్తున్నాడు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు పిల్లలను విక్రయిస్తున్న తంబీని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

More Telugu News