Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫడ్నవిస్ క్షమాపణలు చెప్పాలి: పృధ్వీరాజ్ చవాన్

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ నేత పృధ్వీరాజ్ చవాన్ డిమాండ్ చేశారు. ముంబైలో ఆయన మాట్లాడుతూ, 200 మంది విమాన ప్రయాణికుల ఇబ్బందికి కారణమైన ఫడ్నవిస్ వారికి క్షమాపణలు చెప్పాలని అన్నారు. సాంకేతిక ఇబ్బందులు, భద్రతా సమస్యల కారణంగా విమానాలు ఆలస్యం కావాలి తప్ప, రాజకీయ నేతల వల్ల ఆలస్యంగా నడవడం దుస్సాంప్రదాయమని ఆయన పేర్కొన్నారు. దీనికి కారణమైన ఫడ్నవిస్ ప్రయాణికులకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, మహారాష్ట్రకు పెట్టుబడులు ఆహ్వానించే నిమిత్తం అధికార బృందంతో విదేశీ పర్యటనకు బయల్దేరిన ఫడ్నవిస్, పాస్ పోర్టు మర్చిపోయిన సందర్భంగా ఎయిరిండియా విమానం గంట ఆలస్యంగా వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.

More Telugu News