టూరిస్టు స్పాట్ గా అన్నా హజారే స్వగ్రామం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టూరిస్టు స్పాట్ గా అన్నా హజారే స్వగ్రామం

మహారాష్ట్ర పర్యాటక శాఖ కొత్త పంథాలో పయనిస్తోంది. రాష్ట్రంలో టూరిజం రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు నూతన మార్గాలను అన్వేషిస్తున్న సదరు మంత్రిత్వ శాఖ తాజాగా 'సాంఘిక పర్యాటకం' (సోషల్ టూరిజం) పేరిట నూతన పథకాన్ని తెరపైకి తెచ్చింది. ఈ పథకంలో భాగంగా, ఉద్యమకారులు, సాంఘిక సంస్కర్తల స్వగ్రామాలు, వారితో సంబంధం ఉన్న చారిత్రక ప్రదేశాలను కలుపుతూ ప్రత్యేక ప్యాకేజి రూపొందించింది. ఇందులో అన్నా హజారే స్వగ్రామం రాలేగావ్ సిద్ధి కూడా ఉంది. ఇలాంటి ప్రదేశాలను చూడాలన్న ఆసక్తి ఉన్నా, ఆయా ప్రదేశాలకు ఎలా వెళ్లాలో తెలియని వ్యక్తులను దృష్టిలో పెట్టుకుని ఈ సోషల్ సర్క్యూట్ ప్యాకేజికి రూపకల్పన చేశారు. ఇప్పటికే వందల సంఖ్యలో పర్యాటకులు ఆయా ప్రాంతాల్లో పర్యటించి అన్నా హజారే, బాబా ఆమ్టే తనయుడు వికాస్ ను కలుసుకుని మురిసిపోయారు.

More Telugu News