ఫోన్ ట్యాపింగ్ జరగలేదని చెప్పే దమ్ము, ధైర్యం కేసీఆర్ కు ఉన్నాయా?: పొన్నాల
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫోన్ ట్యాపింగ్ జరగలేదని చెప్పే దమ్ము, ధైర్యం కేసీఆర్ కు ఉన్నాయా?: పొన్నాల

చాలా రోజుల నుంచి సైలెంట్ గా ఉన్న టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తాజాగా ఒక ప్రశ్నను సంధించారు. ఓటుకు నోటు కేసు ఉత్కంఠను రేపుతున్న క్రమంలో, ఏపీ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెర మీదకు తేవడమే కాకుండా, దానిపై సిట్ కూడా వేసింది. ఈ నేపథ్యంలో, ఏపీ నేతల ఫోన్లను ట్యాప్ చేయలేదని చెప్పే దమ్ము కానీ, ధైర్యం కానీ కేసీఆర్ కు ఉన్నాయా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం కానీ, ఏసీబీ కానీ ఎలాంటి ట్యాపింగులకు పాల్పడలేదని టీఎస్ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డితో పాటు పలువురు మంత్రులు పదేపదే చెబుతున్నప్పటికీ పొన్నాల ఈ ప్రశ్న వేయడం గమనార్హం. అంతేకాకుండా, ఇద్దరు ముఖ్యమంత్రులపై ఆయన మండిపడ్డారు. విభజన సమయంలోనే సెక్షన్-8 గురించి చంద్రబాబు, కేసీఆర్ లకు తెలుసని దుయ్యబట్టారు. ఓటుకు నోటు కేసుతో ఇద్దరు సీఎంలు పబ్బం గడుపుకునే పనిలో పడ్డారని విమర్శించారు.

More Telugu News