గవర్నర్ కు విలువ ఇవ్వని వారు సెక్షన్-8 గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది: తలసాని
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గవర్నర్ కు విలువ ఇవ్వని వారు సెక్షన్-8 గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది: తలసాని

హైదరాబాదులో సెక్షన్-8 అమలయ్యే పరిస్థితి లేదని టీఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నగరంలో ఎలాంటి ఇబ్బందికర వాతావరణం లేదని, గొడవలు లేవని, ఇరు ప్రాంత ప్రజలు సామరస్యంగా ఉన్నారని... ఈ పరిస్థితుల్లో సెక్షన్-8 అవసరం ఏం ఉందని ప్రశ్నించారు. సెక్షన్-8 పేరుతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని చెప్పారు. గవర్నర్ కు విలువ ఇవ్వని వారు కూడా సెక్షన్-8 గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకే సెక్షన్-8ను తెర మీదకు తీసుకొచ్చారని ఆరోపించారు.

More Telugu News