అదనపు ఆదాయం కోసం ప్రణాళికలు రూపొందిస్తున్న తెలంగాణ సర్కారు ఎక్సైజ్ విధానాన్ని మార్చాలని భావిస్తోంది. అక్రమ మద్యం, గుడుంబాను అరికట్టాలంటే, ప్రభుత్వం తరపున చీప్ లిక్కర్ ప్రవేశపెట్టాలని, దీని ద్వారా భారీగా ఆదాయం వస్తుందని భావిస్తోంది. తెలంగాణలో రూ. 2 వేల కోట్ల ఆదాయాన్ని అబ్కారీ శాఖ నుంచి అంచనా వేస్తున్న సర్కారు, అందుకు తగ్గట్టు మద్యం విధానం ఉండాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే అధికారులు జులై నుంచి మారే ఎక్సైజ్ సంవత్సరానికి సంబంధించి నివేదికలను తయారు చేసి ప్రభుత్వానికి అందించారని సమాచారం.
కొత్త దుకాణాల ఏర్పాటుకు అనుమతి, లైసెన్స్ ఫీజుల పెంపుపై విధివిధానాలను, చీప్ లిక్కర్ ను ప్రవేశపెట్టడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. గుడుంబా ధరలోనే చీప్ లిక్కర్ ను అమ్మడం ద్వారా ఆ ఆదాయం కూడా ప్రభుత్వ ఖజానాకే చేరుతుందని, ఇదే సమయంలో కల్తీ మద్యాన్ని నిరోధించడానికి అవకాశం ఉంటుందని అధికారులు ప్రతిపాదనల్లో స్పష్టం చేశారు. కాగా, ఈ చౌక మద్యం అమ్మకాల కోసం ప్రత్యేక షాపులను ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఫైల్ పై తెలంగాణ సీఎం సంతకం చేయగానే కొత్త ఆబ్కారీ విధాన ప్రకటన వెలువడుతుందని సమాచారం.
More Telugu News
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ