కెరీర్ స్లామ్ సాధించాలని జకోవిచ్ కన్న కలలు కల్లలయ్యాయి. సమకాలీన టెన్నిస్ దిగ్గజాలు ఫెదరర్, నాదల్, ముర్రేలను దాటుకొని వచ్చిన స్విస్ స్టార్ స్టానిస్లాస్ వావ్రింకా అద్భుతాన్ని ఆవిష్కరించాడు. నిన్న జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో నాలుగు సెట్లలో సెర్బియా యోధుడు, 8 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలుచుకున్న ప్రస్తుత నెంబర్ 1 జకోవిచ్ ని మట్టి కరిపించాడు. గత సంవత్సరం ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో నాదల్ ను ఓడించి తొలి శ్లామ్ గెలుచుకున్న వావ్రింకాకు ఇది రెండో పెద్ద టైటిల్. ఆదివారం జరిగిన పురుషుల ఫైనల్లో 4-6, 6-4, 6-3, 6-4తో జొకోవిచ్ ను వావ్రింకా ఓడించాడు. కాగా, ముర్రేతో సెమీస్ పోరు రెండు రోజులు సాగడం, విశ్రాంతి లేకుండా మూడో రోజు కూడా కోర్టులో ఫైనల్ ఆడడంతో, మ్యాచ్ ప్రారంభంలోనే జకోవిచ్ లో అలసట కనిపించింది. జకో తప్పుపై తప్పు చేస్తూ వెళ్లగా, వాటిని వావ్రింకా తనకు అనుకూలంగా మార్చుకుని టైటిల్ గెలవడం గమనార్హం. మ్యాచ్ అనంతరం జకోవిచ్ కన్నీరు పెట్టాడు. దీంతో అతని అభిమానుల కళ్లూ చెమ్మగిల్లాయి. ఓ అద్భుతమైన బ్యాక్ హ్యాండ్ షాటుతో చాంపియన్ షిప్ పాయింటును సాధించిన వావ్రింకా, మట్టి కోటలో కొత్త రారాజుగా అవతరించాడు.
More Telugu News
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ