నటుడు రజనీకాంత్ కు 'లింగా' చిత్రం మిగిల్చిన నష్టం ఇంకా వెంటాడుతూనే ఉంది. ఈ సినిమాను కొని భారీగా నష్టపోయిన పంపిణీదారులు తమకు రావల్సిన నష్టపరిహారం కోసం మరోసారి నిరసన చేయాలని అనుకుంటున్నారు. గతంలో పంపిణీదారులు నిరసన చేసినప్పుడు రూ.12.5 కోట్లు ఇస్తానని రజనీకాంత్ ఒప్పుకున్నారు. అందులో కేవలం రూ.6 కోట్లు మాత్రమే డిస్ట్రిబ్యూటర్లకు అందాయి. దాంతో రావల్సిన మిగతా సొమ్ము కోసం రజనీ కార్యాలయం ఎదుట ఆందోళన చేయాలనుకుంటున్నట్టు డిస్ట్రిబ్యూటర్ సింగారవేలన్ చెప్పాడు.
అందుకే ఈ విషయంలో రజనీ సార్ జోక్యం చేసుకుని వారంలోగా సెటిల్ చేయాలని కోరుకుంటున్నామన్నారు. రావల్సిన దానికంటే డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు రూ.15 కోట్లు ఎక్కువగా అడుగుతున్నారని మరో డిస్ట్రిబ్యూటర్ తిరుప్పూర్ సుబ్రమణ్యం పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో 'లింగా' నిర్మాత రాక్ లైన్ వెంకటేష్, నష్టాన్ని తాను కూడా భరిస్తానని హామీ ఇచ్చిన రజనీల నుంచి తమ నగదు కోసం ఎదురు చూస్తున్నామని వివరించాడు.
More Telugu News
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి