చంద్రబాబు మెడకు ఓటుకు నోటు కేసు?...టీ సర్కారు యత్నాలతో అప్రమత్తమైన టీడీపీ

03-06-2015 Wed 07:34 | Both States
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక సీటును దక్కించుకునేందుకు టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి చేసిన దుస్సాహసం ఇప్పుడు ఆ పార్టీకి గుదిబండగా మారింది. డబ్బుల కట్టలతో రేవంత్ రెడ్డి ఏసీబీకి అడ్డంగా దొరికిపోగా, ఈ వ్యవహారంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడును కూడా ఇరికించేందుకు తెరవెనుక భారీ కసరత్తే జరుగుతోందట. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న యత్నాలను పసిగట్టిన టీడీపీ వెనువెంటనే అలర్ట్ అయిపోయింది. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏపీలో ప్రతిపక్ష పార్టీ వైసీపీ, తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. అదే క్రమంలో ఇరు పార్టీలకు ప్రధాన ప్రత్యర్థి అయిన టీడీపీ ఉచ్చులో చిక్కడంతో రెండు పార్టీలు మరింత మేర అవగాహనకు వచ్చాయి. దీంతోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్న గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను కలిశారు. రేవంత్ రెడ్డి కేసులో చంద్రబాబును ఏ-1గా చేర్చాలని ఈ సందర్భంగా గవర్నర్ ను జగన్ కోరారు. తదనంతరం తెలంగాణ ఏసీబీ డీజీ కూడా గవర్నర్ తో భేటీ అయ్యారు. రేవంత్ రెడ్డి వద్ద రూ.50 లక్షలు పట్టుబడిన నేపథ్యంలో ఈడీ(ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్)ని రంగంలోకి దించే విషయాన్ని తెలంగాణ సర్కారు పరిశీలిస్తోందట. తెలంగాణలో జరిగిన వ్యవహారంపై ఏపీ ప్రతిపక్ష నేత గవర్నర్ ను కలవడం, వెనువెంటనే ఏసీబీ డీజీ కూడా గవర్నర్ తో భేటీ తదితర పరిణామాలతో టీడీపీ అలర్ట్ అయిపోయింది. ప్రభుత్వ కదలికలను నిశితంగా పరిశీలిస్తున్న ఆ పార్టీ నేతలు కేసుపై పూర్తి స్థాయి దృష్టి సారించారు.

More Telugu News

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14
..more