తెలంగాణ స్పీకర్ కు అస్వస్థత
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణ స్పీకర్ కు అస్వస్థత

తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో, ఆయనను చికిత్స నిమిత్తం నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు మీడియాకు తెలిపారు. స్పీకర్ అస్వస్థతకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అస్వస్థతకు గురవడంతో మధుసూదనాచారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరు కాలేకపోయారు.

More Telugu News