సాధారణంగా కరెంటు బిల్లు వందలు, వేలల్లో వస్తుంది. పెద్ద పెద్ద కంపెనీలైతేనో లేక, సచివాలయం లాంటి పెద్ద కార్యాలయాల్లో అయితే కరెంటు బిల్లు లక్షల్లో ఉంటుంది. కానీ అధికారులు ఓ ఇంటికి 55 కోట్ల కరెంటు బిల్లు పంపి తమ తెలివితేటలు ప్రదర్శించారు. ఆ ఇంటి ఓనర్ గుండె గట్టిది కనుక ఏమీ కాలేదు కానీ, అదే అధైర్యవంతుడైతే ఏం జరిగి ఉండేదో ఊహించుకోవచ్చు. వివరాల్లోకి వెళ్తే... రాంచీలో నివాసముండే కృష్ణ ప్రసాద్ కొన్ని రోజుల క్రితం ఓ వివాహ వేడుకకు వెళ్లాడు. పెళ్లి నుంచి తిరిగి ఇంటికి వచ్చేసరికి కరెంట్ బిల్లు వచ్చి ఉంది. దానిని తీసుకున్న కృష్ణ ప్రసాద్ షాక్ తిన్నాడు.
నెల బిల్లు అక్షరాలా 55, 49, 88, 036 రూపాయిలు వచ్చింది. ఇంత బిల్లును చూసిన తన తల్లి (55) మరణం అంచుల వరకూ వెళ్లిందని మండిపడ్డారు. ఈ బిల్లుపై తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఇంతా చేసి ఆ ఇల్లు రెండు గదుల ఇల్లు. అందులో ఐదుగురు కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. ఈ ఘటనపై స్పందించిన జార్ఖండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్, ఇది సాంకేతిక తప్పిదమని పేర్కొంటూ, ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంది.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు