విమానం ఫుల్ అయిపోయింది. గమ్యస్థానం చేరడానికి బయల్దేరింది. మధ్యలో తుపాను విమానాన్ని దారి మళ్లించింది. ఈ దశలో సాంకేతిక కారణాలతో విమాన ప్రయాణం మరికాస్త ఆలస్యమైంది. ఈ దశలో ప్రయాణికుల చిరాకు పోగొట్టేందుకు పైలట్ పిజ్జా ఇచ్చాడు. ఫిలడెల్ఫియా నుంచి అట్లాంటా వెళ్లాల్సిన డెల్టా ఎయిర్ లైన్స్ విమానం తుపాను కారణంగా నాక్స్ విల్లే ఎయిర్ పోర్టులో దిగింది. అక్కడి ఎయిర్ పోర్టులో రద్దీ కారణంగా డెల్టా ఎయిర్ లైన్స్ విమానానికి క్లియరెన్స్ లభించలేదు.
సుమారు మూడు గంటలపాటు విమానంలోనే ప్రయాణికులు ఉండిపోయారు. దీంతో ప్రయాణికుల్లో అసహనం బయటపడింది. పైలట్, విమాన సిబ్బంది మీద చిరాకు చూపించడం మొదలు పెట్టారు. ప్రయాణికుల అసహనం గమనించిన పైలట్ విమాన సంస్థకు విషయం వివరించాడు. దీంతో డెల్టా ఎయిర్ లైన్స్ విమానంలోని ప్రయాణికులందరికీ పిజ్జా పార్టీ ఇచ్చింది. దీంతో విసుగు మర్చిపోయిన ప్రయాణికులు డెల్టా ఎయిర్ లైన్స్ ను పొగడ్తల్లో ముంచెత్తారు.
More Telugu News
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి