సాంకేతికంగా ముందంజ, వర్ధమాన దేశాల్లో అగ్రరాజ్యంగా ఎదిగే శక్తి ఉన్న దేశంగా పేరుప్రఖ్యాతులు, అంతరిక్షంలో సొంత శక్తితో సత్తాచాటగల సామర్థ్యం, ప్రపంచంలో పేరెన్నికగన్న సంస్థలకు సీఈవోలు... ఇంతటి ఘనకీర్తి ఉన్నప్పటికీ 'ఆకలి రాజ్యం' ట్యాగ్ లైన్ ను మాత్రం భారతదేశం పోగొట్టుకోలేకపోతోంది. ప్రపంచ దేశాల్లో భారత్ లోనే ఎక్కువ మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక వెల్లడించింది. 795 మిలియన్ల ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా ఆహారం కోసం ఎదురు చూస్తుండగా, అందులో 194 మిలియన్ల మంది భారతీయులేనని ఆ నివేదిక పేర్కొంది.
1990-92 మధ్య కాలంలో భారత్ లో 210.01 మిలియన్ల మంది అన్నార్తులు ఉండగా, 2014-15 నాటికి 194.6 మిలియన్లకు పరిమితమైందని నివేదిక పేర్కొంది. అదే సమయంలో చైనా 289 మిలియన్ల అన్నార్తుల సంఖ్యను 133.8 మిలియన్లకు పరిమితం చేసిందని నివేదిక వెల్లడించింది. అన్నార్తుల సంఖ్య తగ్గినప్పటికీ చైనా కంటే భారత్ చాలా వెనుకబడిపోయింది. దీంతో భారత్ 'ఆకలిరాజ్యం' అన్న ట్యాగ్ లైన్ తగిలించుకుని, ఈ విషయంలో చైనాను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచిందని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది.
More Telugu News
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి