Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సచిన్ కు ఎలా వీడ్కోలు చెప్పారో చూడండి: విండీస్ బోర్డు పై లారా ఆగ్రహం

బ్యాటింగ్ దిగ్గజం బ్రయాన్ లారా వెస్టిండీస్ క్రికెట్ బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. బోర్డు వెటరన్ బ్యాట్స్ మన్ శివనారాయణ్ చందర్ పాల్ కు గౌరవంగా రిటైరయ్యే అవకాశం కల్పించకుండా, అవమానకర రీతిలో వ్యవహరిస్తోందంటూ మండిపడ్డాడు. 'సచిన్ టెండూల్కర్ కు బీసీసీఐ ఎంత అద్భుతమైన ముగింపునిచ్చిందో చూడండి' అంటూ విండీస్ బోర్డుకు చురక అంటించాడు. ఏకంగా సచిన్ కోసం ఓ సిరీస్ ను ఏర్పాటు చేసి, ఘనంగా వీడ్కోలు పలికారని గుర్తు చేశాడు. జట్టు కోసం విశేష సేవలు అందించిన చందర్ పాల్ కు కూడా అదే రీతిలో వీడ్కోలు పలకడం అవసరమని ఈ స్టయిలిష్ లెఫ్ట్ హ్యాండర్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్ కు తనను ఎంపిక చేస్తే, క్రికెట్ నుంచి సగౌరవంగా తప్పుకుంటానని చందర్ పాల్ చేసిన విజ్ఞప్తిని విండీస్ క్రికెట్ బోర్డు పట్టించుకోలేదు. ట్రైనింగ్ క్యాంప్ కు అతడిని ఎంపిక చేయకుండా పక్కనబెట్టింది. దీనిపై జట్టు కోచ్ ఫిల్ సిమ్మన్స్ కూడా నిస్సహాయత వ్యక్తం చేశాడు.

More Telugu News