విశాఖ ఏజెన్సీలో మావోలు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విశాఖ ఏజెన్సీలో మావోలు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు

విశాఖ ఏజెన్సీలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. విశాఖ జిల్లాలోని కొయ్యూరు మండలం తీగలమెట్ట అడవిలో రెండు వర్గాల మధ్య కాల్పులు జరిగినట్టు తెలిసింది. ఈ కాల్పుల్లో ఎవరికీ గాయాలు కాలేదని సమాచారం. నిన్న (గురువారం) కూడా కొయ్యూరు మండలం చీడిపల్లి అటవీ ప్రాంతంలో 15 రౌండ్ల కాల్పులు జరిగాయని తెలిసింది.

More Telugu News