బిల్ గేట్స్ తరువాత ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ధనవంతుడైన కార్లోస్ స్లిమ్ తన వ్యాపార విస్తరణలో భాగంగా భారత టెలికం రంగంపై కన్నేశాడని తెలుస్తోంది. ఆయన ఆధ్వర్యంలోని టెలికం సంస్థ అమెరికా మోవిల్, మెక్సికోలో పలు సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో, దాన్ని గట్టెక్కించేందుకు భారత టెలికంలతో భాగస్వామ్యాలు సహకరిస్తాయని కార్లోస్ భావిస్తున్నారని సమాచారం. అందుకోసం రెండు వారాల క్రితం ఇండియాలో కార్లోస్ రహస్యంగా పర్యటించి వెళ్లారని, ఇక్కడి టెలికం సంస్థలతో పాటు ఈ రంగంలోకి ప్రవేశించాలని భావిస్తున్న ఇతర వ్యాపార సంస్థలతోనూ ఆయన చర్చలు సాగించినట్టు తెలుస్తోంది. ఫోర్బ్స్ లెక్కల ప్రకారం సుమారు 77.1 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 4,93,400 కోట్లు) ఆస్తులున్న కార్లోస్ స్లిమ్, తన ఇండియా పర్యటనలో భాగంగా విడియోకాన్ గ్రూపు సంస్థల చైర్మన్ వేణుగోపాల్ ధూత్ ను, కొన్ని ఇతర మొబైల్ కంపెనీల ప్రతినిధులనూ కలిసినట్టు తెలిసింది.
మెక్సికో 'వారెన్ బఫెట్'గా అభిమానులు పిలుచుకునే కార్లోస్, ఇక్కడి టెలికం రంగ వృద్ధి అవకాశాలను తెలుసుకొని ఆశ్చర్యపోయినట్టు ఓ టెలికం సంస్థ ఉన్నతాధికారి ఒకరు వివరించారు. టెలికంతో పాటు విద్య, ఆరోగ్యం, పారిశ్రామికోత్పత్తి, ఆహారం, పానీయాలు, నిర్మాణ రంగం, విమానాలు, మీడియా, గనులు, చమురు, ఆతిథ్యం, వినోదం, సాంకేతికం, ఆర్థిక సేవా రంగాల్లోనూ ఆయన పెట్టుబడులకు ఆసక్తిని చూపారని, అయితే, టెలికం రంగంలో తొలుత తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారని వివరించారు. కాగా, ఈ విషయంలో అమెరికా మోవిల్ ప్రతినిధిని సంప్రదించగా, స్లిమ్ భారత పర్యటనపై ఇప్పటికిప్పుడు స్పందించలేమన్న సమాధానం వచ్చింది.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు