పోలీసుల అదుపులో 110 మంది 'రోమియో'లు... తల్లిదండ్రులకు కౌన్సెలింగ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పోలీసుల అదుపులో 110 మంది 'రోమియో'లు... తల్లిదండ్రులకు కౌన్సెలింగ్

హైదరాబాదు పాతబస్తీలో అర్ధరాత్రి రోడ్లపై తిరుగుతూ, కాలక్షేపం చేస్తున్న 110 మంది 'రోమియో'లను మంగళవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 'ఆపరేషన్ లేట్‌నైట్ రోమియో' పేరిట జరుగుతున్న సోదాల్లో భాగంగా 17 పోలీస్‌ స్టేషన్ల పరిధిలో పనీపాటా లేకుండా తిరుగుతున్న యువకులను సౌత్‌ జోన్ డీసీపీ సత్యనారాయణ ఆదేశాల మేరకు అరెస్ట్ చేసిన పోలీసులు, ఫలక్‌ నుమాలోని నబీల్ ఫంక్షన్ హాల్‌ కు తరలించారు. ఈ ఉదయం వారి తల్లిదండ్రులను పిలిపించిన పోలీసు అధికారులు కౌన్సెలింగ్ మొదలు పెట్టారు. మీ పిల్లలను అదుపులో పెట్టుకోవాలని, మరోమారు వారు రాత్రి పూట రహదార్లపై కనిపిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు.

More Telugu News