మెదడులో పిండం... తెలుగు విద్యార్థినికి అమెరికాలో అరుదైన శస్త్రచికిత్స
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మెదడులో పిండం... తెలుగు విద్యార్థినికి అమెరికాలో అరుదైన శస్త్రచికిత్స

అమెరికాలో తెలుగు విద్యార్థిని యామినికి అరుదైన శస్త్రచికిత్సను చేశారు అక్కడి వైద్యులు. ఎదిగీ ఎదగని అరుదైన పిండస్థ కవల భాగం ఆమె మెదడులో ఉండిపోగా, లాస్ ఏంజిల్స్ లోని స్కల్ బేస్ ఇన్ స్టిట్యూట్ వైద్యులు విజయవంతంగా తొలగించారు. గడచిన 17 సంవత్సరాలుగా అమె మెదడులో ఈ పిండం ఉందని, దీనికి ఎముకలు, వెంట్రుకలు, పళ్లు కూడా ఏర్పడ్డాయని డాక్టర్లు తెలిపారు. అత్యంత అరుదుగా ఇలా జరుగుతుందని వెల్లడించిన డాక్టర్లు మరో మూడు వారాల్లో యామిని కోలుకుంటుందని తెలిపారు.

More Telugu News