ఏపీలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు ఈ నెల 23న... తెలంగాణలో రేపే విడుదల
పరీక్షా ఫలితాల కోలాహలానికి తెరలేవనుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఫలితాలు విడుదల చేసేందుకు ఆయా బోర్డులు సిద్ధమయ్యాయి. ఏపీలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు ఈ నెల 23న విడుదల చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు నేడు ప్రకటన చేశారు. అటు, తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలను రేపు విడుదల చేస్తున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఫలితాల సీడీని విడుదల చేస్తారు.