వరంగల్ జిల్లాలో కీచక పర్వం... మైనర్ బాలికపై ఆరుగురు మృగాళ్ల అకృత్యం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వరంగల్ జిల్లాలో కీచక పర్వం... మైనర్ బాలికపై ఆరుగురు మృగాళ్ల అకృత్యం!

వరంగల్ జిల్లాలో గత రాత్రి కీచక పర్వం సాగింది. ఓ మైనర్ బాలికపై ఆరుగురు మృగాళ్లు అకృత్యానికి పాల్పడ్డారు. జిల్లాలోని చేర్యాలలో వెలుగుచూసిన ఈ ఘటనలో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. తన సోదరుడు పిలుస్తున్నాడని చెప్పిన మాయగాడి మాట నమ్మి నిందితుడి బైక్ పై ఎక్కిన చేర్యాలకు చెందిన ఆ బాలిక లైంగిక దాడికి గురైంది. బాలికను బైక్ పై ఎక్కించుకున్న యువకుడు, ఆమెను పట్టణం శివారుకు తీసుకెళ్లి మరో ఐదుగురితో కలిసి సామూహిక అత్యాచారం జరిపాడు. నిందితుల దాడి నేపథ్యంలో బాలిక కేకలు వేయగా, గమనించిన స్థానికులు అక్కడికి చేరుకుని నిందితులను పట్టుకున్నారు. అనంతరం వారికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. లైంగిక దాడిలో గాయపడ్డ బాలికను పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

More Telugu News