నీల్ నితిన్ ముఖేశ్ కొత్త అవతారం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నీల్ నితిన్ ముఖేశ్ కొత్త అవతారం

బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేశ్ నిర్మాతగా కొత్త అవతారం ఎత్తనున్నాడు. మిరాగ్ గ్రూప్ ఛైర్మన్ మదన్ పాలివాల్ తో భాగస్వామ్యంలో నితిన్ చిత్రనిర్మాణం చేపట్టనున్నారు. తన చేతిలో నాలుగు స్క్రిప్టులు ఉన్నాయని, వాటిలో రెండైనా ఈ ఏడాది ప్రారంభిస్తామని నీల్ నితిన్ చెప్పారు. హాస్య చిత్రాలను మాత్రం తాను ఎంచుకోనని అతడు స్పష్టం చేశాడు. ఫేడ్ అవుట్ అయిపోతున్న దశలో, లేదా పీక్ దశలో ఉండగా బాలీవుడ్ నటులు సినీ నిర్మాణాన్ని ప్రధాన వ్యాపకంగా ఎంచుకుంటున్నారు. జాన్ అబ్రహాం, దియా మీర్జా, అమీషా పటేల్ ల బాటలో నీల్ నితిన్ ముఖేశ్ పయనించడం విశేషం.

More Telugu News