పంట నష్టపోయిన రైతులకు మోదీ భారీ ప్యాకేజ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పంట నష్టపోయిన రైతులకు మోదీ భారీ ప్యాకేజ్!

అకాల వర్షాల కారణంగా పంట కోల్పోయిన రైతులకు భారీ ప్యాకేజ్ ఇవ్వాలని మోదీ సర్కారు నిర్ణయించినట్టు తెలిసింది. పంట నష్టపోయిన రైతులు గతంలో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను రద్దుచేయాలని, ఆ డబ్బు డైరెక్ట్ గా రైతుల జన ధన్ యోజన ఖాతాల్లో వేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దయనీయ పరిస్థితుల్లో ఉన్న రైతులకు తదుపరి పంట కోసం వడ్డీ లేని రుణాలను ప్రకటించాలని కూడా మోదీ సర్కారు నిర్ణయం తీసుకోనుంది. గడచిన రబీ సీజన్లో బీహార్, గుజరాత్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడి వేలాది ఎకరాల్లో చేతికొచ్చిన పంట నీటి పాలైన సంగతి తెలిసిందే. దీంతో ఆహార ఉత్పత్తుల దిగుబడి సైతం అంచనాలకన్నా 40 లక్షల టన్నులు తగ్గింది. గడచిన 100 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ లేనంతగా మార్చిలో వర్షపాతం నమోదైన సంగతి తెలిసిందే.

More Telugu News