Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గుంటూరు జిల్లాలో సుగంధ ద్రవ్యాల పార్కు ప్రారంభించిన చంద్రబాబు

గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం, వంకాయలపాడులో ఏర్పాటు చేసిన సుగంధ ద్రవ్యాల పార్కును ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కలసి ప్రారంభించారు. దేశంలోనే 9వదైన ఈ పార్కును 124 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయనున్నారు. దాని ఏర్పాటుతో వ్యవసాయ అనుబంధ ఉత్పత్తుల తయారీ స్థాపనల ముందడుగు పడింది. సుగంధ ద్రవ్యాల పార్కు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 3 వేలమందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. పార్కులో వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, ఇతర అనుబంధ శాఖల ప్రదర్శన ఏర్పాటు చేశారు.

More Telugu News