ముగ్గురు పోలీసులను పొట్టనబెట్టుకుని తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్తు దేశాన్ని భయాందోళనల్లోకి నెట్టిన ‘సూర్యాపేట షూటర్స్’ తాజాగా సిమీ ఉగ్రవాదులని తేలిపోయింది. ఈ మేరకు తెలంగాణ డీజీపీ కార్యాలయం ప్రకటించింది. పోలీసుల కాల్పుల్లో హతమయ్యేదాకా వారెలా ఉంటారో తెలియదు. అయితే బతికుండగా వారి ముఖాలను తన కెమెరాలో బంధించిన తెలుగు దినపత్రిక ‘సాక్షి’ అర్వపల్లి విలేకరి శ్రీరంగం వెంకన్నకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
అర్వపల్లి మండల కేంద్రంలో బైక్ పై ఓ ఉగ్రవాది కూర్చుని ఉండగా... ఓ చేత కార్బన్, మరో చేత పిస్టల్ పట్టుకుని ఘీంకరిస్తూ ఆ బైక్ ఎక్కుతున్న మరో ఉగ్రవాదిని వెంకన్న ఫొటో తీసిన సంగతి తెలిసిందే. సదరు ఫొటో ప్రస్తుతం మీడియాలోనే కాక సోషల్ మీడియాలోనూ హల్ చల్ చేస్తోంది. అదే సమయంలో వెంకన్న ధైర్యసాహసాలను మెచ్చుకుంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రాణాలకు తెగించి ఉగ్రవాదుల ఫొటోలను తీసిన వెంకన్నకు తెలంగాణ ప్రెస్ అకాడెమీ రూ.15 వేల నగదు పురస్కారాన్ని ప్రకటించగా, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రూ.10 వేల నగదు పురస్కారాన్ని ప్రకటించింది.
More Telugu News
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు