కేంద్ర మంత్రి రహస్య కెమెరా ఘటన నిందితులకు బెయిల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేంద్ర మంత్రి రహస్య కెమెరా ఘటన నిందితులకు బెయిల్

గోవా వస్త్రదుకాణంలో రహస్య కెమెరా పెట్టి దుస్తులు మార్చుకుంటున్న ఘటనను చిత్రీకరిస్తున్న ఫ్యాబ్ ఇండియా షాప్ కు చెందిన నిందితులు నలుగురికి గోవా న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గోవాలోని ఫ్యాబ్ ఇండియా వస్త్రదుకాణంలోకి షాపింగ్ కు వెళ్లిన కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ, రహస్య కెమెరాలను గుర్తించారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని ఆందోళన రేగింది. అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్న 48 గంటల్లోనే వీరికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడం విశేషం. కాగా, వీరిని గోవా వదిలి వెళ్లవద్దని న్యాయస్థానం ఆదేశించింది.

More Telugu News