అరబ్బుల దేశం యెమెన్ నుంచి భారతీయులంతా తక్షణం వెనక్కి రావాలని భారతప్రభుత్వం పిలుపునిచ్చింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. యెమెన్ లో ఘర్షణ వాతావరణం పెరిగిపోవడంతో అక్కడున్న భారతీయులు ఘర్షణల్లో చిక్కుకుని ఇబ్బందులు పడకుండా, ప్రమాదాల బారిన పడకుండా తక్షణం స్వదేశానికి తిరిగి రావాలని భారత ప్రభుత్వం కోరింది. స్వదేశానికి చేరేందుకు అందుబాటులో ఎలాంటి రవాణా సౌకర్యం ఉన్నా దానిని వినియోగించుకుని తక్షణం స్వదేశానికి తరలి రావాలని విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి భారతీయులను కోరారు.
యెమెన్ లో ఉన్న భారతీయుల్లో చాలామంది నర్సింగ్ వృత్తిలోనే ఉన్నారని, వారంతా పరిస్థితి తీవ్రతను గుర్తించి వెనక్కి రావాలని ఆయన పిలుపునిచ్చారు. 3 వేల మంది నుంచి 3,500 మంది వరకు భారతీయులు ఉంటారని ఆయన తెలిపారు. ఈ మేరకు సనాలో ఉన్న భారతీయ రాయబార కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. కాగా, యెమెన్ అధ్యక్షుడితో పాటు, అక్కడి ప్రభుత్వ నేతలపై షియా మిలీషియా వర్గాలు దాడులకు తెగబడుతున్న విషయం తెలిసిందే.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు