ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య రేపు జరగనున్న వరల్డ్ కప్ సెమీ ఫైనల్ పోరును తిలకించేందుకు ఉద్యోగులు పెద్దయెత్తున సెలవులు పెడుతున్నారట. భారత్ లో ఈ మ్యాచ్ పై ఒక సర్వే నిర్వహించి మొత్తం 6 వేల మందిని ప్రశ్నించగా, అందులో 34 శాతం మంది తమకు ఆరోగ్యం బాగా లేదని సెలవు పెట్టనున్నట్టు తెలిపారు. మరో 2 శాతం మంది తమ ఇంట్లో దొంగతనం జరిగిందని సెలవు పెట్టనున్నట్టు చెప్పడం గమనార్హం. ఈఎస్ పీఎన్ క్రిక్ ఇన్ఫో ఈ సర్వేను నిర్వహించింది. ఈ దఫా క్రికెట్ పోటీల్లో ఇండియా ఆడిన మ్యాచ్ లు దాదాపు వారాంతాల్లో వచ్చాయి. ఫైనల్ పోరుకు ముందు జరుగుతున్న మరో ఫైనల్ పోరుగా భావిస్తున్న సెమీ ఫైనల్ మాత్రం గురువారం జరగనుంది. ఈ పోటీ ఆసాంతం దగ్గరుండి తిలకించాలని భావిస్తున్న వారి సంఖ్య అధికంగా ఉంది. ఆఫీసులకు వెళితే స్కోర్ మాత్రమే తెలుసుకుంటూ కూర్చోవాల్సి ఉంటుందని అత్యధికులు అభిప్రాయ పడుతున్నారు.
కాగా, కొన్ని ఐటీ కార్యాలయాలు రేపు సెలవును ప్రకటించాయి. తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు రేపు సెలవు ఇచ్చినట్టు బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న 'ప్లే రైట్' బిజినెస్ విభాగం హెడ్ నయాంత్ర పాణి తెలిపారు. ఇక సిటీ బ్యాంకు గురువారాన్ని 'నో మీటింగ్ డే'గా ప్రకటించింది. తాము ఉద్యోగులకు సెలవు ఇవ్వడం లేదని, మ్యాచ్ చూసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని కోక కోలా తెలిపింది. ఒక ముఖ్యమైన మ్యాచ్ ని చూసేందుకు ఆసక్తి చూపుతున్న ఉద్యోగులందరికీ సెలవు మంజూరు చేసినట్టు కేపీఎంజీ ఉన్నతోద్యోగి షాలినీ పిళ్ళై తెలిపారు.
మరి, మీ మాటేమిటి? మ్యాచ్ ని చూసేందుకు మీరు ఎలాంటి ప్లాన్ వేస్తున్నారు? మీకు కూడా జ్వరం వస్తుందేమో! కాకపోతే, మరో అత్యవసర పని పడుతుంది... అంతే కదా?
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు