తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి తెలంగాణలో కలకలం రేగింది. హైదరాబాదు పరిధిలోని మల్కాజిగిరి, మహబూబ్ నగర్ లో పోలైన ఓట్లలో కొన్ని గల్లంతయ్యాయి. పోలైన ఓట్ల సంఖ్య కంటే బాక్సుల్లో తక్కువ ఓట్లు ఉండటంతో అధికారులు విస్మయానికి గురయ్యారు. విషయం తెలుసుకున్న అభ్యర్థులు కూడా ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించారు. బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లు గల్లంతు కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దీనిపై సమాచారం అందుకున్న తెలంగాణ ఎన్నికల సంఘం అధికారి నవీన్ మిట్టల్ వివరణ ఇచ్చారు. ‘‘పోలింగ్ సందర్భంగా చివరి గంటలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీ ఎత్తున తరలివచ్చారు. అంతేకాక కొన్ని సాంకేతిక కారణాల వల్ల కూడా ఓట్లు తగ్గవచ్చు’’ అని ఆయన చెప్పిన వివరణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాలెట్ పత్రాలతో ఓటింగ్ జరిగితే, ఓట్ల సంఖ్య ఎలా తగ్గుతుందని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత ఈ విషయంపై పెద్ద ఎత్తున రభస జరిగే అవకాశాలు లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు