హైదరాబాదులో ఇద్దరు చిన్నారుల అదృశ్యం
హైదరాబాద్ కాటేదాన్ ప్రాంతంలో ఇద్ధరు చిన్నారులు అదృశ్యమయ్యారు. వారిద్ధరు నిషాకుమారి, రాజేంద్రకుమార్ గా గుర్తించారు. నగరంలోని హకీంపేట సీఆర్ పీఎఫ్ పాఠశాల వద్ద చిన్నారులు తప్పిపోయారని తెలుస్తోంది. నిన్న సాయంత్రం శ్రీరామనవమి కార్యక్రమానికి వెళ్లిన వారు తిరిగి రాకపోవడంతో అపహరణకు గురయ్యారని తల్లిదండ్రులు మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
చిన్నారులిద్దరూ రవి పబ్లిక్ స్కూలులో చదువుతున్నారని చెప్పారు. దీనిపై స్పందించిన స్థానిక ఎస్సై.. పిల్లలిద్దరిని ఎవరూ కిడ్నాప్ చేయలేదని చెప్పారు. దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నామన్నారు. రెండురోజుల కిందట చిన్నారి శ్రియ అపహరణ, హత్య ఘటన మరువక ముందే నగరంలో చిన్నారులు అదృశ్యమవడం పలువురిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.