తెలంగాణ పీఏసీ (ప్రజా పద్దుల సంఘం) ఛైర్మన్ గా కాంగ్రెస్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనతో పాటు ఈ పదవికి రాంరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఎన్నికయ్యారు. వారిద్దరు పీఏసీ పదవిలో చెరిసగం రోజుల పాటు ఉంటారు. అంచనాల కమిటీ ఛైర్మన్ గా టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాంలింగారెడ్డి, పీయూసీ ఛైర్మన్ గా ఎమ్మెల్యే దివాకర్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.