సాధారణంగా రాజకీయ నేతల కుమారులు ఎంతో దర్పం ప్రదర్శిస్తుంటారు. వారి విద్యార్హతలు ఏపాటివైనా కానీ, వారు మాత్రం ఎక్కడా తగ్గరు. ఆ నేతాశ్రీలు కూడా తమ సంతానం దర్జాగా బతకాలని ఆశిస్తుంటారు. కానీ, అలాంటి రాజకీయనేతలకు ఈ రాజస్థాన్ ఎమ్మెల్యే పూర్తి వ్యతిరేకం. వివరాల్లోకెళితే... హీరాలాల్ వర్మ ఓ బీజేపీ ఎమ్మెల్యే. ఆయన కుమారుడు హన్సరాజ్ 8వ తరగతి పాసయ్యాడు. తన స్థాయికి తగిన విధంగా కుమారుడిని కూడా పార్టీలోకి తీసుకువచ్చి ఏదైనా పదవి ఇప్పించే వీలున్నా హీరాలాల్ వర్మ అలా చేయలేదు. తనయుడి విద్యార్హతలకు తగిన ఉద్యోగంలోనే అతడిని చేర్చాలని నిర్ణయించుకున్నాడు.
ఈ క్రమంలో, అజ్మీర్ లోని కృషి ఉపాజ్ మండి (రాజస్థాన్ స్టేట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ బోర్డు)లో ప్యూను ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు పంపాడు. ఆ కుర్రాడు ఇతర అభ్యర్థులతో పాటే క్యూలో నిలుచుని ఉండడం మీడియా కంటబడింది. తన కొడుకు తక్కువ విద్యార్హత కలిగి ఉన్నందున, ఈ ఉద్యోగమైతే అతనికి సరిపోతుందని భావించానని రెండుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన వర్మ తెలిపారు. అతని స్థాయికి మించిన పనిచేయమని ఎలా ప్రోత్సహించగలమని ప్రశ్నించారు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు