కృష్ణా జిల్లా ఘంటసాలలో కొద్దిసేపటి క్రితం దారుణం చోటుచేసుకుంది. ఓ ఆటో డ్రైవర్ గ్రామానికి చెందిన తండ్రీకొడుకులపై మెరుపు దాడికి దిగాడు. ఈ దాడిలో కొడుకు మృతి చెందగా, తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే అక్కడకు చేరుకుని దాడి చేసిన ఆటో డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడి దాడిలో గాయపడ్డ వ్యక్తిని హుటాహుటిన మచిలీపట్నంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు దారి తీసిన కారణాలు తెలియరాలేదు.