ముంబయిలో దారుణ మారణహోమం సృష్టించి, చివరికి పట్టుబడ్డ పాకిస్థాన్ ఉగ్రవాది అజ్మల్ కసబ్ విషయంలో ఆసక్తికర అంశం వెల్లడైంది. కసబ్ జైల్లో ఉన్నప్పుడు మటన్ బిర్యానీ కావాల్సిందేని డిమాండ్ చేశాడంటూ మీడియాలో వార్తలు రావడం తెలిసిందే. అయితే, దాడి కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా వ్యవహరించిన ఉజ్వల్ నికమ్ అసలు విషయం వెల్లడించారు. కసబ్ నిజంగా మటన్ బిర్యానీ కోరలేదని, తామే అలా ప్రచారం చేశామని తెలిపారు. తాము అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరించారు.
కేసులో విచారణ జరుగుతున్న సందర్భంగా ఓ రోజు కోర్టులో కసబ్ తల దించుకుని కన్నీళ్లు తుడుచుకోవడం కనిపించిందని, దాంతో మీడియా, కసబ్ కంట్లో కన్నీళ్లు అని న్యూస్ బ్రేక్ చేసిందని చెప్పారు. ఆ రోజున రక్షాబంధన్ పర్వదినం కావడంతో, పాక్ లో ఉన్న తన సోదరి గుర్తొచ్చి కన్నీటి పర్యంతమయ్యాడని వార్తలు రావడంతో, కసబ్ విషయంలో ఓ రకమైన భావోద్వేగపూరిత వాతావరణం ఏర్పడిందని, ఆ సమయంలో అతడిపై అందరికీ జాలి కలిగే సూచనలు కనిపించాయని ఉజ్వల్ నికమ్ తెలిపారు.
ఓ దశలో అతడు అమాయకుడేమో అని కూడా కొందరు సందేహించే పరిస్థితి ఏర్పడిందని, ఇలాంటి పరిస్థితికి అడ్డుకట్ట వేసేందుకే తాము కసబ్ మటన్ బిర్యానీ కావాలని జైలు అధికారులతో గొడవకు దిగుతున్నాడని ప్రచారం చేశామని ఆయన వివరించారు. దీంతో, ఆ ఉగ్రవాదిపై అందరిలోనూ మామూలు భావం ఏర్పడిందని చెప్పారు. 'అతను బిర్యానీ అడగలేదు, ప్రభుత్వం అందించనూ లేదు' అని వెల్లడించారు. కౌంటర్ టెర్రరిజంపై జైపూర్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆయన ఈ విషయాలు పంచుకున్నారు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు