ముంబై పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్న ఆ ‘బేబి’ చిన్న పాపాయేమీ కాదు. యువతను మత్తులో ముంచి కోట్లు గడిస్తున్న మహా మాయలేడి. శశికళ పతంకర్ అలియాస్ బేబి కోసం మహారాష్ట్ర పోలీసులతో పాటు యాంటీ నార్కోటిక్స్ సెల్ (ఏఎన్సీ), నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డు(ఎన్సీబీ)లు సంయుక్తంగా సోదాలు జరుపుతున్నా, ఆమె జాడ దొరకడం లేదట. ముంబైలో మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ లో బేబి కాకలు తీరిన బంటట.
ముంబైలోని వర్లీ ప్రాంతానికి చెందిన సిద్దార్థ నగర్ లోని మురికివాడను కేంద్రంగా చేసుకున్న బేబి, పోలీసులకు ఏమాత్రం చిక్కకుండా తన కార్యకలాపాలను యథేచ్ఛగా సాగిస్తోందట. పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న బేబికి ముంబై పోలీసు శాఖలో మంచి మిత్రులు కూడా ఉన్నారట. వారి సహయ సహకారాలతోనే బేబి తప్పించుకుని తిరుగుతోందట. మొన్నటికి మొన్న ఇంటిలోనే కాక పోలీస్ స్టేషన్ లోని తన లాకర్ లోనూ భారీ ఎత్తున డ్రగ్స్ ను కలిగి ఉన్న కారణంగా పట్టుబడ్డ కానిస్టేబుల్ కూడా బేబి మిత్రుడేనట. ఐదుగురు సోదరుల ముద్దుల చెల్లెలైన బేబి, తన అన్నల బాటలోనే నడుస్తోందని పోలీసు రికార్డులు చెబుతున్నాయి. బేబి సోదరులందరిపైనా హత్య నేరాలకు సంబంధించిన కేసులున్నాయట.
More Telugu News
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి