మంచి విద్యాబుద్ధులు నేర్పి ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడు తన స్వార్థానికి విద్యార్థులను వినియోగించుకునే ప్రయత్నం చేసి వారిని తప్పుదోవపట్టించాడు. వివరాల్లోకి వెళితే... తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లా ఇలుప్పూర్ సమీపంలోని ముక్కన్నామలైపట్టి ప్రభుత్వ పాఠశాలకు చెందిన పదోతరగతి విద్యార్థులు మద్యం తాగి స్పృహతప్పి పడిఉండగా, సహవిద్యార్థులు గుర్తించారు. దీంతో వారిని ఆసుపత్రికి తరలించారు. దీంతో వారి తల్లిదండ్రులు ఆసుపత్రికి వెళ్లి విషయం ఆరాతీయగా ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. గతేడాది ఆ పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడి సర్వీస్ రిజిస్టర్ అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. దీంతో ఆ ఉపాధ్యాయుడు తన ఎస్ఆర్ కనిపించకుండా పోవడానికి కారణం ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్న సహోపాధ్యాయుడేనని అనుమానించాడు.
దీంతో వారి మధ్య వివాదం నెలకొంది. ఆ ఘటనపై ఇరువురు ఉపాధ్యాయులు గ్రామ విద్యాకమిటీకి ఫిర్యాదు కూడా చేసుకున్నారు. దీంతో ఉపాధ్యాయులు, వారి మద్దతుదారులుగా పాఠశాలలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఎస్ఆర్ కోల్పోయిన ఉపాధ్యాయుడు తన వర్గానికి చెందిన ఐదుగురు విద్యార్థులకు 500 రూపాయలు ఇచ్చి పూటుగా తాగి పాఠశాలకు వచ్చి ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడు, అతని అనుచరులపై దాడి చేయాలని చెప్పాడు. దీంతో మద్యం కొనుక్కొచ్చిన విద్యార్థులు పాఠశాల వద్దే తాగి, మోతాదు మించడంతో పడిపోయారు. ఈ విషయాలను విద్యార్థులు మద్యం మత్తులో తల్లిదండ్రులకు గొణుగుతూ చెప్పడంతో వాస్తవాలు వెలుగు చూశాయి. దీంతో వారి తల్లిదండ్రులు పాఠశాలను ముట్టడించారు. డీఈవో సంఘటనపై విచారణ జరుపుతున్నారు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు