ప్రభుత్వ విధానాలపై నిరసన తెలిపేందుకు ఒక్కొక్కరూ ఒక్కో పంథా అనుసరిస్తుంటారు. స్వచ్ఛ భారత్ ద్వారా దేశం మొత్తం పరిశుభ్రత దిశగా ప్రయాణిస్తుంటే... కేంద్రప్రభుత్వం ప్రతిపాదిస్తున్న భూసేకరణ చట్ట సవరణలపై జార్ఖండ్ లో స్వచ్ఛ భారత్ కు విఘాతం కలిగేలా వినూత్న నిరసన తెలిపారు. జార్ఖండ్ లో నక్సల్స్ కు పట్టున్న లాతేహార్ జిల్లాలోని 60 గ్రామాలకు చెందిన ప్రజలు భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా, బార్వాదీ బ్లాక్ కార్యాలయం ముందు సామూహిక బహిరంగ బహిర్భూమి కార్యక్రమం నిర్వహించారు. బిల్లులో ఉన్న కంపును దేశం దృష్టికి తీసుకువచ్చేందుకే ఇలా చేశామని నిరసనకారులు తెలిపారు.
కీలకమైన ఐదు రంగాల్లో ప్రాజెక్టుల నిర్మాణానికి సామాజిక అంచనా తప్పనిసరి అనే క్లాజ్ ను తొలగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అలాగే భూసేకరణ చేపట్టే సమయంలో 80 శాతం మేరకు భూయజమానుల సమ్మతి అవసరం లేదన్న నిబంధనను కూడా కేంద్రం ఆర్డినెన్స్ లో పేర్కొంది. ఈ రెండు క్లాజుల వల్ల రైతులు, భూయజమానులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పారిశ్రామిక వర్గాలు మినహా, అన్నివర్గాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ రెండు క్లాజులను బిల్లు నుంచి తప్పించని పక్షంలో జార్ఖండ్ రాష్ట్రమంతటా ఇలాంటి కార్యక్రమాలు చేపడతామని నిరసనకారులు తెలిపారు. వీటిపై ప్రతిపక్షాలు కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు