పాకిస్థాన్ క్రికెటర్ మిస్బా ఉల్ హక్ ను దేవుడు కరుణించినట్టున్నాడు. హక్ బ్యాటింగ్ చేస్తుండగా, హాజిల్ వుడ్ వేసిన 5వ ఓవర్ 3వ బంతి లెగ్ సైడ్ వెళ్తూ, మిస్బా ప్యాడ్ ను ఆపై స్టంప్స్ ను తాకుతూ వెళ్లింది. దీంతో స్టంప్స్, బెయిల్స్ లో ఉన్న ఎల్ఈడీ లైట్లు కూడా వెలిగాయి. కానీ బెయిల్స్ మాత్రం కింద పడలేదు. అప్పటికే 2 వికెట్లు తీసి జోరుమీదున్న ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్లు ఒక్క క్షణం సంబరాలు చేసుకొని, ఆ పై విషయం తెలిసి సర్దుకున్నారు. మిస్బా కు లభించిన ఈ లైఫ్ ను అతను ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి. ప్రస్తుతం పాకిస్థాన్ స్కోర్ 7 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 26 పరుగులు.