టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ వరుస విజయాల బ్యూటీ అనుష్క శర్మలు ఇకపై మీడియా కళ్లుగప్పి తిరగాల్సిన అవసరం లేదేమో. ఎందుకంటే, వారిద్దరూ ఈ ఏడాది చివరలో పెళ్లి చేసుకోబోతున్నారట. ఈ మేరకు ఓ జాతీయ దినపత్రిక నిన్న ఓ కథనం రాసింది. ఈ ఏడాది చివరలో కోహ్లీ, అనుష్క శర్మలు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. ఈ మేరకు వారిద్దరి కుటుంబాలు కూడా ఓ అంగీకారానికి వచ్చాయని విశ్వసనీయ సమాచారం. తాము పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయామని ఇప్పటికే వారిద్దరూ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఉన్నట్టుండి సడెన్ గా పెళ్లి ప్రకటన వచ్చేందుకు కారణమేంటని ఆరా తీస్తే, ఆసక్తికర అంశం వెలుగు చూసింది. బాలీవుడ్ నటి రాఖీ సావంత్ ఇటీవల కోహ్లీకి ప్రేమలేఖ రాసిన సంగతి తెలిసిందే. రాఖీ లేఖ కలకలంతో ఇక ఎంతమాత్రం ఆలస్యం చేసినా బాగోదనుకున్న కోహ్లీ, అనుష్కలు పెళ్లి పీటలెక్కేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.