ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ వాడీవేడిగా కొనసాగుతోంది. వైకాపా అధినేత జగన్ మాట్లాడుతూ, బడ్జెట్ లెక్కలు కూడా తెలియని వారు ... తాను మాట్లాడుతున్నప్పుడు అడ్డుపడుతున్నారని, ముఖ్యంగా అచ్చెన్నాయుడిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనికి బదులుగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, తండ్రిని అడ్డుపెట్టుకుని లక్ష కోట్లు సంపాదించిన అనుభవం తనకు లేదని జగన్ కు కౌంటర్ ఇచ్చారు. తన శరీరం గురించి లావు, ఒడ్డు, పొడుగు అంటూ జగన్ విమర్శిస్తున్నారని... తనకు ప్రతి అంశంపైన అవగాహన ఉందని చెప్పారు. అచ్చెన్నాయుడు జగన్ ను విమర్శిస్తుండగా, వైకాపా సభ్యులు అడ్డుకున్నారు.