చదివింది డిగ్రీనే. అయితేనేం తానో ఐఏఎస్ అధికారిని అంటూ అతడు జనాన్ని ఈజీగానే నమ్మించేశాడు. కేంద్ర పరిశ్రమల శాఖలో రీజనల్ డైరెక్టర్ గా పనిచేస్తున్న తాను ఆంధ్రా, ఒడిశా, తమిళనాడులోని ఆ శాఖ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నానని నమ్మబలికాడు. ఎర్రబుగ్గ కారు, దానిపై ప్రభుత్వ వాహనమన్న నేమ్ ప్లేట్ అతడికి మరింత ఊతాన్నిచ్చాయి. దీనికి తోడు నేర్చుకున్న నాలుగు ఇంగ్లీష్ ముక్కలతో మాయ చేశాడు. తన చేతి కింద ఉన్న పరిశ్రమల్లో ఉద్యోగాలిప్పిస్తానని నమ్మించాడు. 400 మంది దగ్గర కోట్లాది రూపాయలను వసూలు చేశాడు. తీరా ఉద్యోగాలు లేవు. తీసుకున్న డబ్బు కూడా అతడు తిరిగి ఇవ్వడం లేదు. పైపెచ్చు డబ్బడిగితే, అంతు చూస్తానంటూ బాధితులపైనే విరుచుకుపడతాడట.
వివరాల్లోకెళితే... శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురానికి చెందిన రమేశ్ నాయుడు డిగ్రీ దాకా చదువుకున్నాడు. ఉన్నత విద్య కోసమంటూ ఊరి నుంచి బయటకు వచ్చిన అతడు, విశాఖకు చెందిన ఓ గ్రూప్-1 అధికారి కూతురును వివాహం చేసుకున్నాడు. అంతే, ఒక్కసారిగా అతడిలోని మాయగాడు బయటకొచ్చేశాడు. తానో ఐఏఎస్ అధికారినంటూ జనాన్ని మాయ చేశాడు. ఉద్యోగాలిప్పిస్తానని చెప్పి, విశాఖలోని చిన వాల్తేరుకు చెందిన 400 మందిని మోసం చేశాడు. ఏళ్లు గడుస్తున్నా ఉద్యోగాలు రాకపోవడంతో డబ్బు తిరిగివ్వమన్న బాధితులపై అతడు అంతు చూస్తానంటూ ఒంటికాలిపై లేస్తాడట. ఈ నేపథ్యంలో అతడి నుంచి డబ్బు వసూలు చేసుకోలేక, చేసిన అప్పులకు వడ్డీలు కట్టుకోలేక సతమతమవుతున్న కొందరు నగర పోలీస్ కమిషనర్ అమిత్ గార్గ్ ను కలిసేందుకు సమాయత్తమవుతున్నారు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు