హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. సకాలంలో పోలీసులు స్పందించి వారిని ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. వివరాల్లోకి వెళితే... ఖైరతాబాదులో నివసించే హేమలత, శ్రీకృష్ణానగర్ లో నివసించే శివ కొంతకాలం ప్రేమించుకున్నారు. విభేదాలు తలెత్తడంతో దూరమయ్యారు. దీంతో, నమ్మించి మోసం చేశాడని, అతనితోనే వివాహం జరిపించాలని హేమలత పోలీసులకు ఫిర్యాదు చేసింది. శివను పోలీసులు పిలిచి విషయం అడిగారు.
హేమలతను వివాహం చేసుకునే ప్రసక్తి లేదని శివ తేల్చిచెప్పడంతో, పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం ఇద్దరూ చర్చించుకుని సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. దీంతో వారిద్దరూ తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగారు. దీనిని గమనించిన పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు