ఎస్సీ వర్గీకరణను డిమాండ్ చేస్తూ ఆందోళన కొనసాగిస్తున్న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) నేడు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. ఆది నుంచి వర్గీకరణకు అనుకూలంగా వ్యవహరించిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, రాష్ట్ర విభజన తర్వాత సడెన్ గా తన వైఖరి మార్చుకున్నారు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్, వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేసినా, అమలు చేసే విషయంలో నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నారు.
ఈ రెండు అంశాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎమ్మార్పీఎస్, నేడు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. ముట్టడిలో పాల్గొనేందుకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు హైదరాబాదు చేరుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు ఉద్యోగ ప్రకటనల జారీ కోసం రోడ్డెక్కిన నిరుద్యోగ జేఏసీ కూడా నేడు తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది.
ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. ఆందోళనకారులు అసెంబ్లీ వైపు దూసుకురాకుండా అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ బారీకేడ్లు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ పరిధిలోని 2 కిలో మీటర్ల మేర వాహనాల రాకపోకలను నిషేధించారు. భారీ ఎత్తున బలగాలను రంగంలోకి దించారు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు