తీవ్రవాదుల పట్ల తన వ్యవహార శైలిలో పాకిస్థాన్ తీరుమారుతున్నట్టు కనిపిస్తోంది. పాలుపోసి పెంచిన పాము మాదిరిగా తీవ్రవాదులు వ్యవహరిస్తుండడం పట్ల పాకిస్థానీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరిహద్దుల్లో శిక్షణ తీసుకుని, ప్రభుత్వ వ్యతిరేకత పేరిట వరుస బాంబు పేలుళ్లతో స్వదేశీయులనే హతమారుస్తుండడం పట్ల పాక్ ప్రజలు మండిపడుతున్నారు. దీంతో తీవ్రవాదులపై తిరగబడుతున్నారు. ఆదివారం రెండు చర్చిలపై ఆత్మాహుతి దాడులకు తెగబడడంతో స్ధానికుల కోపం కట్టలు తెంచుకుంది. దీంతో అనుమానితులు ఇద్దరిని సజీవ దహనం చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ లో నేడు ఒకే రోజు ఉగ్రవాదం, హత్యా నేరాల కింద మరణశిక్ష పడిన 12 మంది ఖైదీలను ఉరి తీశారు. పాక్ ప్రభుత్వం మరణశిక్షపై నిషేధం ఎత్తివేసిన తరువాత ఒకే రోజు 12 మందికి శిక్ష అమలు చేయడం ఇదే తొలిసారి. కరాచీ, లాహోర్, ఝాంగ్, రావల్పిండి, ముల్తాన్, మియాన్ వాలీ, ఫైసలాబాద్ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 12 మంది ఖైదీలను ఉరితీశారు. మరణశిక్షపై నిషేధం ఎత్తివేసిన తరువాత ఇప్పటి వరకు మొత్తం 39 మందిని ఉరితీశారు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు