మార్షల్ ఆర్ట్స్ రంగంలో కొత్త ఒరవడి సృష్టించిన బ్రూస్ లీ ప్రేరణగా అప్పట్లో ఎందరో 'డిష్యుం, డిష్యుం' సినిమాలతో అలరించేందుకు బయల్దేరారు. బ్రూస్ లీ సినిమాలతో ఉత్తేజం పొందిన జాకీచాన్, జెట్ లీ, వాన్ డామ్ తదితరులు ఈ కోవలోకే వస్తారు. అయితే, చిన్న వయసులోనే బ్రూస్ లీ మరణించడంతో ఎంటర్ ది డ్రాగన్, ద బిగ్ బాస్, ఫిస్ట్ ఆఫ్ ఫ్యూరీ వంటి హిట్ చిత్రాలే అభిమానులకు అతని స్మృతిగా మిగిలాయి. ఇదిలా ఉంటే, ఇటీవల ఆప్ఘనిస్థాన్ కు చెందిన అబ్బాస్ అలీ జాదా అనే వ్యక్తి అచ్చు గుద్దినట్టు బ్రూస్ లీలా ఉండడంతో వార్తల్లోకెక్కాడు. ఇతగాడు కూడా మార్షల్ ఆర్ట్స్ నిపుణుడే. మనవాడికి కూడా బ్రూస్ లీనే ఆదర్శం!
ఇప్పుడు అలీ జాదా ఆఫ్ఘన్ లో ఓ సెలబ్రిటీ. ఇతనికో లక్ష్యం ఉందట. బ్రూస్ లీ 1973లో చనిపోయే నాటికి అసంపూర్ణంగా మిగిలిపోయిన 'గేమ్ ఆఫ్ డెత్' సినిమాను పూర్తి చేయాలన్నదే ఆ లక్ష్యం. దీనిపై అలీ జాదా మాట్లాడుతూ... "బ్రూస్ తన చివరి చిత్రాన్ని పూర్తిచేయలేదు. సగం మాత్రమే చేశాడు. ఇప్పుడు నా ప్రాజెక్టు ఆ సినిమాను పూర్తిచేయడమే" అని వివరించాడు. అతని కోరిక నెరవేరుతుందో? లేదో? కాలమే చెప్పాలి.
More Telugu News
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ