ప్రజాప్రయోజనాలు కాలరాసేలా ఎన్డీయే ప్రభుత్వం భూసేకరణ సవరణ బిల్లు లోక్ సభలో ప్రవేశపెట్టిందని యూపీయే అధినేత్రి సోనియా గాంధీ ఆరోపించారు. ఢిల్లీలో భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా విపక్షాలు పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్ కు పాదయాత్ర చేపట్టిన అనంతరం ఆమె మాట్లాడుతూ, భూసేకరణ బిల్లులో ఇష్టారాజ్యంగా సవరణలు చేశారని అన్నారు. పారిశ్రామిక ప్రయోజనాల పేరిట ప్రజలకు నష్టం కలుగుతుంటే చూస్తూ ఉరుకోబోమని ఆమె పేర్కొన్నారు. భూసేకరణ బిల్లు కారణంగా జరిగే నష్టాలను ప్రజలకు విడమర్చి చెబుతామని ఆమె స్పష్టం చేశారు.