బంగ్లాదేశ్ తో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ నాకౌట్ పోరు కావడంతో టీమిండియా ఎంత శ్రమిస్తుందో అనుకునేరు! అలాంటిదేమీ జరగలేదు. మంగళవారం మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ కు చేరుకున్న ఆటగాళ్లు నెట్స్ లో సాధన చేసేందుకు బదులు ఎంచక్కా సాకర్ ఆడి రిలాక్సయ్యారు. మనవాళ్ల నెట్ ప్రాక్టీస్ సెషన్ ను కవర్ చేసేందుకు వచ్చిన మీడియా బృందం సాకర్ గేమ్ చూసి వెనుదిరిగింది. మీడియాతో మాట్లాడేందుకు ధోనీ సేన విముఖత కనబర్చింది. కాగా, భారత్-బంగ్లాదేశ్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ పై మాజీ క్రికెటర్ జవగల్ శ్రీనాథ్ తన వ్యాసంలో స్పందించారు.
వరల్డ్ కప్ చరిత్రలో భారత జట్టు బంగ్లాదేశ్ తో తలపడిన ప్రతి సందర్భం తనకు గుర్తేనని, అందరూ 2007 నాటి ఫలితాన్ని ప్రస్తావిస్తున్నారని శ్రీనాథ్ పేర్కొన్నాడు. అప్పుడు కరీబియన్ గడ్డపై జరిగిన మెగా ఈవెంట్లో బంగ్లా జట్టు మనవాళ్లకు షాకివ్వడం తెలిసిందే. ఆ టోర్నీ ఆరంభం నుంచే జట్టులో ఆత్మవిశ్వాసం లోపించిందని, అదే బంగ్లాదేశ్ తో పోరులోనూ ప్రతిఫలించిందని శ్రీనాథ్ తెలిపాడు. ఇప్పుడు బంగ్లాదేశ్ జట్టు అత్యుత్తమ ఆటతీరు కనబర్చినా, గెలవడం ఎలాగో తెలిసిన టీమిండియా ముందు అది సరిపోదని అభిప్రాయపడ్డాడు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు