వాళ్లు పోలీసులు కావాలని కలలు కన్నారు. విద్యార్హతలు ఉన్నాయి... పరీక్షలూ రాశారు. కానీ, ఎన్నో ఆశలు పెట్టుకున్నా ఫలితాలు మాత్రం రావడంలేదు. నాలుగేళ్లు ముగిసినా ఫలితాలు వెల్లడి కాకపోవడంతో విసిగివేసారిపోయిన జార్ఖండ్ నిరుద్యోగులు తాము మావోయిస్టులుగా మారాలా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. జార్ఖండ్ ఆర్మ్డ్ పోలీసు విభాగంలోని తొమ్మిది బెటాలియన్లలో మొత్తం 1020 ఖాళీల భర్తీకి 2011లో పరీక్షలు జరిగాయి. తొలుత రెండు పరీక్షలు నిర్వహించిన పోలీసు శాఖ తుది పరీక్షను కూడా నిర్వహించారు. అయితే, ఇప్పటివరకు ఆ పరీక్షల ఫలితాలను వెలువరించలేదు.
ఫలితాల వెల్లడిపై అభ్యర్థులు హైకోర్టుకెళ్లగా, వెంటనే వెల్లడించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. పరీక్షా ఫలితాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు పోలీసు ఉన్నతాధికారులను, ప్రభుత్వాధికారులను, నేతలను కలిసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో, వారు రాష్ట్ర ముఖ్యమంత్రి రఘువర్ దాస్ ను కలుసుకునేందుకు నాలుగు రోజులుగా ప్రయత్నిస్తున్నారు. సీఎం ను కలిసేందుకు అపాయింట్ మెంట్ లభించకపోవడంతో రాంచీలోని పోలీసు అదనపు డెరైక్టర్ జనరల్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. ఆత్మాహుతికి పాల్పడడమో లేక మావోయిస్టుల్లో చేరిపోవడమో తప్ప తమకు మరో మార్గం లేదంటూ ఫ్లెక్సీలు ప్రదర్శించారు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు