ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 30 ఏళ్ల పాటు ప్రపంచానికి దూరంగా ఇంట్లో గడిపేశారు ఓ కుటుంబానికి చెందిన సభ్యులు. 1984లో ఇందిరాగాంధీ మరణానంతరం చెలరేగిన సిక్కు వ్యతిరేక అల్లర్లను చూసిన రైల్వే ఉద్యోగి జోగీందర్ సింగ్ బేడీ కుటుంబ సభ్యులు ఏకంగా 30 ఏళ్లు ఇంట్లోనే ఉండిపోయారు. అతని భార్య నిర్మల్ కౌర్, కుమార్తె కమల్ జీత్, కొడుకు ఇందిరాపాల్ సింగ్ లు షాక్ కు గురయ్యారు. ఇంటి బయటకోస్తే తమను ఎవరైనా చంపేస్తారని భయపడి బయటి ప్రపంచంలోనికి రావడం మానేశారు. అలహాబాద్ దగ్గర్లోని మొగ పట్టణంలో నివసించే వీరిని జోగీందర్ తనతో పాటు అలహాబాద్ రమ్మన్నా రారట. అంతకంటే బాధాకరమైన విషయం ఏంటంటే.... వాళ్లు బయటకు రారు, జోగీందర్ ను లోపలికి రానివ్వరట.
ఆయనే నెలకొకసారి నిత్యావసర సరకులన్నీ తీసుకుని వెళ్లి వారికి ఇస్తారు. కనీసం తనను ఇంట్లో ఉండనివ్వమన్నా ఉండనివ్వరని ఆయన వాపోయారు. నాలుగేళ్ల క్రితం విద్యుత్ బిల్లు కట్టకపోవడం వల్ల సరఫరా నిలిపేశారట. అయినా చీకట్లోనే గడిపేశారు కానీ, బయటికి రాలేదు. దీంతో, వారేమైపోతారో అని భయపడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగప్రవేశం చేసి, వారిని బయటకు తెచ్చేందుకు శతవిధాలా ప్రయత్నించారని ఆయన తెలిపారు. తనను ముట్టుకుంటే చంపేస్తానని తన కుమార్తె బెదిరించిందని, దాంతో పోలీసులు నిచ్చెన సాయంతో లోపలికి దిగి వారిని బయటకు తీసుకువచ్చారని ఆయన చెప్పారు.
అనంతరం న్యాయస్థానం ఆదేశాలతో వారిని మానసిక చికిత్సాలయంలో ఉంచారట. ఇప్పుడు తన వయసు 70 ఏళ్లని, రిటైర్ అయి చాలా కాలం అయిందని, ఇప్పటికైనా తన కుటుంబం మామూలుగా మారితే చాలని జోగీందర్ సింగ్ కోరుకుంటున్నాడు. సిక్కు వ్యతిరేక అల్లర్లు తన కుటుంబంలో తీరని చిచ్చురేపాయని ఆయన అభిప్రాయపడుతున్నాడు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు