Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సాంబారులో కప్ప: ఆందోళనలో 400 మంది విద్యార్థులు

కడప జిల్లా ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీ విద్యార్థులు రోడ్డెక్కారు. గత కొంత కాలంగా మెస్ నిర్వాహకులపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మరోసారి విద్యార్థులు నిరసన చేపట్టాల్సిన స్థితి వచ్చింది. మధ్యాహ్నం భోజనానికి వెళ్లిన విద్యార్థులకు సాంబారులో కప్ప దర్శనమిచ్చింది. దీంతో ఇడుపులపాయ నుంచి కడపకు 400 మంది విద్యార్థులు రాస్తారోకో చేపట్టారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు గండి-ఇడుపులపాయ రహదారిపై బైఠాయించారు. మెస్ నిర్వాహకుడిపై చర్యలు తీసుకుంటామని ఐఐఐటీ డైరెక్టర్ చెప్పినా, ఇది ఎన్నోసారని ప్రశ్నించిన విద్యార్థులు కలెక్టర్ వచ్చి మెస్ నిర్వాహకుడిని మారుస్తానని హామీ ఇస్తేనే రాస్తారోకో విరమిస్తామని చెప్పారు.

More Telugu News