వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ దేశ వ్యాప్తంగా పెద్ద చర్చకే తెర తీస్తున్న బీజేపీ నేతలు తమ దూకుడును కొనసాగిస్తున్నారు. తాజాగా ఆ పార్టీ నేత సాధ్వీ ప్రాచీ, బాలీవుడ్ ఖాన్ త్రయంపై విరుచుకుపడ్డారు. లవ్ జీహాద్ ను ప్రోత్సహిస్తున్న ఖాన్ త్రయం షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ ల సినిమాలను బహిష్కరించాలని ఆమె హిందువులకు పిలుపునిచ్చారు. ఈ ఖాన్ త్రయం నటించే చిత్రాలనే కాక వారు నిర్మించే చిత్రాలను కూడా బహిష్కరించాలని ఆమె కోరారు.
ఇక, మదర్ థెరిసాపై ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను సాధ్వీ సమర్ధించారు. హిందువుల్లోని నిమ్న వర్గాలను క్రైస్తవులుగా మార్చేందుకు థెరిసా యత్నించారని ఆమె ఆరోపించారు. రాహుల్ గాంధీపైనా విరుచుకుపడ్డ సాధ్వీ, ‘‘రాహుల్... సాధ్యమైనంత త్వరగా పెళ్లి చేసుకో. మీ తల్లి, సోదరి ఆందోళన చెందుతున్నారు. అయితే మీరు వివాహమాడే యువతి భారతీయురాలైతే సంతోషిస్తాం’’ అని వ్యాఖ్యానించారు.
More Telugu News
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు